ఓవర్ స్పీడ్ తో పాటు, సౌండ్ ఎక్కువ చేస్తున్న టూవీలర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి తెలిపారు.నగరంలోని కొంతమంది ఆకతాయిలు బండి సైలెన్సర్ మారుస్తూ.
శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారని, విపరీతమైన సౌండ్ తో మిగతా వాహనదారులకూ చుక్కలు చూపిస్తున్నారని అన్నారు.దీంతో ఇతర వాహనదారుల దృష్టి మరలి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ తరహా చర్యలకు పాల్పడే వారికిపై తీసుకునే చర్యలలో భాగంగా ప్రత్యేక సైలెన్సర్ లను అమర్చిన వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.అధిక శబ్దం వచ్చే బులెట్ వాహనాల నుండి మెకానిక్ ద్వారా సైలెన్సర్ లను తొలగిస్తున్నట్లు తెలిపారు.
తిరిగి సైలెన్సర్ బిగించి ఇదే తరహా చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఆశోక్, ఎస్సై రవి పాల్గొన్నారు.







