మరికొన్ని గంటల్లో రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ( Jailer movie )థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన జైలర్ ట్రైలర్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించగా కావాలయ్య సాంగ్ లో తమన్నా డ్యాన్స్ స్టెప్పులకు పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే బుకింగ్స్ విషయంలో జైలర్ మూవీ అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేస్తూ రజనీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 15 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వస్తుండగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.జైలర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ ( Rajinikanth )కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
కర్ణాటకలో, ఏపీలో కూడా ఈ సినిమా బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం జైలర్ మూవీ దూకుడుకు ఎవరూ బ్రేకులు వేయలేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జైలర్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జైలర్ సినిమా కాపీ ఆరోపణలపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
తెలుగులో మాత్రం భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) వల్ల జైలర్ కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉంది.పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.భోళా శంకర్, జైలర్ సినిమాలలో బాక్సాఫీస్ వద్ద విజేత ఎవరో స్పష్టత రావాల్సి ఉంది.
జైలర్ సినిమా బుకింగ్స్ విదేశాల్లో కూడా అదుర్స్ అనేలా ఉన్నాయి.ఈ సినిమాతో రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ స్థాయిలో సత్తా చాటుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.