ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాల వేడి తారస్థాయికి చేరుకుంటోంది.ముఖ్యంగా అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ మద్య జరుగుతున్నా రాజకీయ రగడ అంతా ఇంతా కాదు.
ఈసారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలతో ఉంటే.ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు చెక్ పెట్టి మరోసారి విజయకేతనం ఎగురవేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( CM Jagan ) భావిస్తున్నారు.
దీంతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అమలు చేస్తున్న వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు పోలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి.ఇదిలా ఉంచితే ప్రాజెక్ట్ ల విషయంలో జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు చంద్రబాబు ప్రాజెక్ట్ ల సందర్శన చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబు రాయలసీమ పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరు( Punganur )లో చోటు చేసుకున్న పరిణామాలు ఎంతటి సంచలనానికి దారి తీశాయో తెలిసిందే.వైసీపీ, టీడీపీ కార్యకర్తల మద్య మొదలైన రగడ పోలీసులు vs టీడీపీ కార్యకర్తలుగా మారి ఏకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేంతా వరకు దారి తీసింది.ఇక పోతే తాజాగా చంద్రబాబు నాయుడు( Chandra babu naidu ) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమరాన్ని రేపుతున్నాయి.అన్నమయ్య జిల్లా అంగళ్ళులో తనను చంపాలని చూశారని, తనపై హత్య యత్నానికి పోలీసులు కూడా సహకరించారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు అంతే కాకుండా అల్లర్లపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమరాన్ని రేపుతున్నాయి.
అయితే రాజకీయ నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాకపోయిన ఎన్నికల ముందు ఈ తరహా వ్యాఖ్యలు కొత్త చర్చలకు తావిస్తున్నాయి.ఈ అల్లర్ల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని చంద్రబాబు ఆరోపిస్తుంటే.కాదు కాదు చంద్రబాబే రాజకీయ లభ్ది కోసం ఇతర అల్లర్లు సృస్టించుకుంటూ ఆ నింద వైసీపీపై నేడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
దీంతో ఎవరిది హత్య రాజకీయం అనే పాయింట్ పై హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి.మొత్తానికి ఎన్నికలు దగ్గర పడే కొద్ది టీడీపీ వైసీపీ మద్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.