నేను లీగల్ గా వెళ్తే విషయం మరోలా ఉంటుంది.. అంబటిపై 'బ్రో' నిర్మాత సీరియస్!

లేటెస్ట్ గా టాలీవుడ్ లో మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ”బ్రో ది అవతార్”( Bro The Avatar ) రిలీజ్ అయిన విషయం తెలిసిందే.వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

 Bro Producer Tg Vishwa Prasad Strong Counter To Ambati Rambabu Details, Ambati R-TeluguStop.com

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.

ఓపెనింగ్స్ అద్భుతంగా రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత తేలిపోయింది.

రోజురోజుకూ కలెక్షన్స్ భారీగా తగ్గుతూ వస్తున్న ఈ సినిమా విషయంలో అంబటి రాంబాబు( Ambati Rambabu ) ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది.ఈయన బ్రో సినిమాపై సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ సినిమాలో అంబటి రాంబాబు క్యారెక్టర్ ను పృథ్వీ తో కావాలని చేయించారని ఆయన ఆరోపించారు.

అలాగే నిర్మాత ఈ సినిమాను బ్లాక్ మనీతో తీసారని పవన్ కు ఇచ్చిన పారితోషికం అంత కూడా ఈ సినిమా కలెక్షన్స్ రాలేదని అంతా ఆయన సెటైర్స్ వేయగా విశ్వప్రసాద్( TG Vishwa Prasad ) కూడా ఈయన వ్యాఖ్యలకు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.ఇక ఇప్పుడు అంబటి ఈ సినిమాపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని చెప్పడం చూసాం.ఇక ఈ క్రమంలోనే బ్రో నిర్మాత విశ్వప్రసాద్ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేసారు.

”నేను ఆయన అన్న మాటలన్నీ గాలి మాటలుగానే వదిలేసాను.మా దగ్గర అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇదే మేటర్ ను నేను కూడా సీరియస్ గా తీసుకుంటే మరోలా ఉంటుందని.అంతవరకు వస్తే నేను కూడా లీగల్ గా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఈయన తాజాగా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.

మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube