ఏపీలో జనసేన( JanaSena Party ) మరియు బీజేపీ పార్టీలు ( BJP party )పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ రెండు పార్టీలు కూడా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీలు ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశాయి.ఇక టీడీపీని కూడా కలుపుకోవాలని పవన్ ఆరాట పడుతున్నప్పటికి ఆ పార్టీ విషయంలో బీజేపీ వైఖరి ఇంకా సందిగ్ధంగానే ఉంది.
ఒకవేళ టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఆసక్తి చూపకపోతే.పవన్ బీజేపీతోనే ఉంటారా ? లేదా టీడీపీ తో జట్టు కడతారా ? అనేది అంచనా వేయలేని పరిస్థితి.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్ బీజేపీతోనే ఉంటారనేది కొందరి అభిప్రాయం.ఒకవేళ బీజేపీతోనే ఉంటే ఈ రెండు పార్టీలలో ఉమ్మడి సిఎం అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.నిన్న మొన్నటి వరకు రెండు పార్టీలకు పవనే సిఎం ( Pawan Kalyan )అభ్యర్థిగా ఉంటారనే టాక్ నడిచింది.కానీ ఇప్పుడు బీజేపీ తరుపున పురందేశ్వరి పేరు వినిపిస్తోంది.
ఈ మద్యనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టిన ఆమె.సిఎం పదవికి అర్హులనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందట.పైగా ప్రత్యర్థి పార్టీలపై ధీటైన విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టడంలో పురందేశ్వరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.
అందుకే అధిష్టానం అధ్యక్ష పదవిని ఆమెకు కట్టబెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఇప్పుడు సిఎం అభ్యర్థిగా కూడా అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపితే.మరి పవన్( Pawan Kalyan ) సంగతేంటి ? అనేది ఆసక్తికరంగా మారింది.తన టార్గెట్ ముఖ్యమంత్రి కావడమే అని ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసిన పవన్.సిఎం అభ్యర్థిగా ఉండేందుకే ఇష్టపడతారు.మరి అందుకు బీజేపీ సహకరించకపోతే.వాట్ నెక్స్ట్ పవన్ ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.నిన్న మొన్నటి వరకు సిఎం అభ్యర్థి విషయంలో టీడీపీతోనే ఇబ్బందులు ఫేస్ చేసిన జనసేన ఇప్పుడు బీజేపీ విషయంలో కూడా అదే సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.మరి పవన్ ఎలా అడుగులు వేస్తారో చూడాలి.