Hyper Aadi : ఆ యాంకర్ ను పెళ్లి చేసుకోనున్న హైపర్ ఆది.. త్వరలో నిశ్చితార్థం కూడా?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Jabaradast Comedian Hyper Aadi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆది చేసే కామెడీ, అతను వేసే పంచులు, అతని టైమింగ్ అంతా బాగా క్లిక్ అవుతూ ఉంటాయి.

 Comedian Hyper Aadi To Marry Anchor Viral News-TeluguStop.com

ఇక ఆది తొలిసారిగాజబర్దస్త్ లో మొదటిగా రైటర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తన పంచులతో బాగా ఫేమస్ అయ్యి టీం లీడర్ గా మారాడు.ఆ తర్వాత వరుస షోలలో పాల్గొంటూ బిజీగా అయిపోయాడు.

Telugu Hyper Aadi, Jabardasth, Youtube, Youtube Anchor-Movie

శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ), జబర్దస్త్, ఢీ షోలలో తన పంచులతో బాగా హడావుడి చేస్తూ ఉంటాడు.ఇక వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని నటుడుగా కూడా తనకంటూ ఒక గుర్తింపు.ఇక బుల్లితెరపై అప్పుడప్పుడు అతిగా ప్రవర్తిస్తూ మితిమీరి డైలాగులు కూడా కొడుతూ ఉంటాడు.అవతలి వ్యక్తులు ఎవరున్నారు అని కూడా చూడకుండా తన నోటికొచ్చిన డైలాగులు కొడుతూ వారిని కించపరుస్తూ ఉంటాడు.

ఇప్పటికీ ఈయనపై చాలామంది విమర్శలు చేశారు.తను అతిగా ప్రవర్తిస్తూ అమ్మాయిలపై డబల్ మీనింగ్ డైలాగులు కొడుతున్నాడని ఇతనిపై మండిపడ్డారు.

కానీ తను మాత్రం అలాగే రెచ్చిపోతూ డైలాగులు కొడుతూ ఉంటాడు.ఇక ఇదంతా పక్కన పెడితే ఈయన వయసు 30 ఏళ్లకు పైగా ఉంటాయని చెప్పవచ్చు.

ఇక ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.చూడటానికి ఆయన లో వయసు మీద పడినట్లు అనిపిస్తూ ఉంటుంది.

Telugu Hyper Aadi, Jabardasth, Youtube, Youtube Anchor-Movie

దీంతో తనకు పెళ్లి( Hyper Aadi Marriage ) ఎప్పుడు అంటూ కామెంట్లు కూడా ఎదురవుతూ ఉంటాయి.ఇక మధ్య మధ్యలో షో లలో ఫేక్ పెళ్లిళ్లు చేసుకొని అదే తన పెళ్లి అనుకోని తెగ మురిసిపోయేవాడు.కానీ నిజంగా మాత్రం తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది తనకు కూడా డౌట్ గా ఉండేది.ఇంతకాలానికి ఇతడు పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త బాగా వైరల్ అవుతుంది.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.బుల్లితెరపై హైపర్ ఆది ఈ స్థానంలో ఉండటానికి కారణం యూట్యూబ్ లో పనిచేసే ఒక యాంకర్( YouTube Anchor ) అని తెలిసింది.

ఇక ఆమె సపోర్టు తోనే ఆయన ఇంత క్రేజ్ తెచ్చుకున్నట్లు తెలిసింది.దాంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని దీంతో ఆ ప్రేమను పెళ్లితో ముడి వేయాలని అనుకుంటున్నారని తెలిసింది.

Telugu Hyper Aadi, Jabardasth, Youtube, Youtube Anchor-Movie

అంతేకాకుండా తమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పటంతో వాళ్లు కూడా ఒప్పుకున్నారని.దీంతో త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని వీళ్లిద్దరి నిశ్చితార్ధం( Hyper Aadi Engagement ) కూడా చేయటానికి తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం గురించి హైపర్ ఆది స్పందించే వరకు వేచి చూడాల్సిందే.ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ అవ్వడంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube