రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు.అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అతిథి గృహం చేరుకున్న ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్ తో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,
ఎమ్మెల్యే రమేష్ బాబు, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అద్దాల మండపంలో ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్ ను వేద ఆశీర్వాదం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.