బాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం నుంచి నటిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి నటి అలియా భట్ ( Alia Bhatt )గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.ఈమె రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం అలియా నటించిన బ్రహ్మాస్త్ర కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) నుపెళ్లి చేసుకున్నారు.ఇలా పెళ్లైన ఏడాదికే బిడ్డకు జన్మనివ్వడంతో అలియా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం తన కుమార్తె రాహా ( Rahaa ) ఆలన పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ జూలై 28న థియేటర్లలోకి రానుంది.ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్( Rocky aur Rani Movie Promotions ) కార్యక్రమాలలో భాగంగా అలియా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అలియాకు తన కుమార్తె రాహ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే తన కుమార్తె గురించి అలియా మాట్లాడుతూ తన కూతురు కూడా తన అడుగుజాడలలో నడవాలని నేను కోరుకోవడం లేదు అంటూ తెలియచేశారు.తాను చిత్ర పరిశ్రమలో కాకుండా మంచి శాస్త్రవేత్తగా ( Scientist ) పేరు సంపాదించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను అంటూ తన కూతురి భవిష్యత్తు గురించి అలాగే తనని ఇండస్ట్రీ వైపు తీసుకురాను అంటూ అలియా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.