నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )హీరోగా ప్రస్తుతం భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.హీరోగా బాలయ్య జోరు మామూలుగా లేదు.
అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల తర్వాత భగవంత్ కేసరి సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడు.అంతే కాకుండా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని అంతా భావించారు.
కానీ ఇప్పటి వరకు బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా మొదలు అవ్వలేదు.కనీసం కథ రెడీ అయినట్లుగా కూడా అనిపించడం లేదు.
ఇప్పటి వరకు బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో మూడు సినిమాలు వచ్చాయి.
ఆ మూడు సినిమా లు కూడా సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి.కనుక మరో విజయం కూడా ఈ జోడీ మరియు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తెలుగు ప్రేక్షకులు అంతా కూడా వీరి కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూశారు.
కానీ ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమా తర్వాత బోయపాటి తో సినిమా చేయడం లేదని తేలిపోయింది.బాబీ దర్శకత్వంలో సినిమా ను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
బోయపాటి శ్రీను దర్శకత్వం లో బాలయ్య సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ కలిగించే విధంగా బ్యాడ్ న్యూస్ చెప్పారు.
బోయపాటి శ్రీను తో బాలయ్య సినిమా వచ్చే ఏడాది జరుగబోతున్న ఎన్నికల ముందు ఉండదు అని తేలిపోయింది.అంతే కాకుండా వీరి కాంబోలో మూవీ కోసం 2025 వరకు ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ కాంబో సినిమా పై అంచనాలు భారీగా ఉన్నా ఎప్పటికి ప్రారంభం అయ్యేది తెలియడం లేదు.
బాలయ్య సినిమా లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి.కానీ బోయపాటి సినిమా రావడానికి కాస్త సమయం పట్టనుంది.