గత కొన్నాళ్లుగా బీజేపీ మరియు బిఆర్‌ఎస్ మద్య ఒప్పందం కుదిరిందని, రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ గట్టిగా విమర్శిస్తోంది.బీజేపీ, బిఆర్‌ఎస్ పార్టీ( BJP and BRS )ల వైఖరి చేస్తే కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం ఉందనే భావన రాకమానదు.
ఎందుకంటే ఉప్పు నిప్పులా ఉండే ఈ రెండు పార్టీలు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరస్పర విమర్శల వేడి బాగా తగ్గించాయి.బీజేపీ పైనా, మోడీ సర్కార్ పైనా ఉవ్వెత్తున్న మండిపడే కేసిఆర్ మరియు కేటిఆర్.
ఈ మద్య అసలు బీజేపీ ప్రస్తావనే తీసుకురావడం లేదు.బీజేపీని కాదని ప్రస్తుతం కాంగ్రెస్( Congress ) పై విమర్శల దాడి పెంచారు.
అటు బీజేపీ కూడా కేసిఆర్ సర్కార్ పై అరకొర విమర్శలు చేస్తూందే తప్పా.గతంలో మాదిరి ఘాటైన విమర్శలు చేయడం లేదు.

మరివైపు కవితా మద్యం కేసు( Kavita Liquor Case ) కూడా అడుగున పడిపోవడంతో నిజంగానే బద్ద శత్రువులుగా ఉండే ఈ రెండు పార్టీలు మిత్రా పక్షంగా మారిపోయాయా ? అనే డౌట్ చాలమందిలో వ్యక్తమైంది.ఇదిలా ఉంచితే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..ఈ రెండు పార్టీలకు సంబంధించి మరో అగ్గి రాజేశారు.వచ్చే నెలలో కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని అందుకు సంబంధించి కేంద్ర పెద్దలతో కేటిఆర్ ద్వారా కేసిఆర్ చర్చలు జరిపించారని వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఒక్కసారిగా తెలంగాణలో పోలిటికల్ హిట్ రాజుకుంది.

ఎందుకంటే ఇటీవల కేటిఆర్ డిల్లీ పర్యటన( KTR Delhi Tour )లో భాగంగా కేంద్ర బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు.దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనేమో అనే సందేహాన్ని రేపుతున్నాయి.ఒకవేళ కోమటిరెడ్డి( Komatireddy Venkatreddy ) చెప్పినట్లుగా వచ్చే నెలలో కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేస్తే బిఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కలిసి ప్లాన్ చేశాయనే వాదన మరింత బలపడే అవకాశం ఉంది.అది కాస్త కాంగ్రెస్ కు ప్లెస్ అయిన ఆశ్చర్యం లేదు.
అయితే ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఎన్నికలు జరగాల్సిఉంది.కానీ కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని బిఆర్‌ఎస్ మొదటి నుంచి చెబుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాలి.