రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో నూతనంగా పున ప్రతిష్ట నిర్వహించిన హనుమాన్ ఆలయంలో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించి 41 రోజులు అవుతున్న శుభ సందర్భంగా ఆలయంలో గ్రామ సర్పంచ్ సామ కవితా తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మండల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా ఆలయంలో వినాయక పూజ కార్యక్రమంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు నవగ్రహ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డి, ఆలయ చైర్మన్ కంటే మల్లయ్య, కార్యదర్శి అన్నడ్డి కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రేమల రమేష్, నేదురి శ్రీనివాస్, గ్రామస్తులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…