మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా( Khammam )లోని 350 మంది తలసేమియా వ్యాధి గ్రస్త పిల్లల కోసం జూన్ 20వ తేదీ మంగళవారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు ఖమ్మం జిల్లా వైరా( Wyra ) లోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న వాసవి కళ్యాణ మండపం నందు “రక్తదాన శిబిరం” ఏర్పాటు చేస్తున్నాము.కావున సోషల్ వర్కర్లు, రక్త దాతలు స్పందించి రక్త దానం చేసి, ఇతరుల ద్వారా చేపించి తలసేమియా బాధిత పిల్లలకు మీ వంతు సహకారాన్ని అందించాలని మనవి.
మీరు చేసే రక్తం దానం ( Blood Donation)వలన పసిపిల్లల ప్రాణాలు కాపాడిన వారవుతారు.రక్తదానం చేయండి.ప్రాణదాతలు కండి.మీరు ఈ విషయాన్ని మరో 10 మందికి తెలియజేసి వారు కూడా రక్త దానం చేసేలా ప్రోత్సహించగలరు.
ప్రస్తుత ఎండాకాలం సమయంలో తలసేమియా పిల్లలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వివరాల కోసం 8309633034 సంప్రదించగలరు.