జనసేనకు పెరుగుతున్న అర్థబలం?

ప్రజాదరణ విషయంలోనూ కార్యకర్తల బలం విషయంలోనూ మిగతా పార్టీలకు పోటీ ఇవ్వగలుగుతున్నప్పటికీ ఆర్దిక బలం విషయంలో మాత్రం వెనుకబడి ఉన్న జనసేనకు( Janasena party ) క్రమంగా ఆ బలం కూడా వచ్చి చేరుతున్నట్లుగా తెలుస్తుంది .వచ్చే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర( Active role in elections ) పోషించగలరని నమ్మకం పెరుగుతున్నందున ఆర్థికంగా బలమైన నేతలు కూడా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారట.

 Janasena Get Financial Support Rapidly Details, Active Role In Elections,ap News-TeluguStop.com

నిజానికి జనసేన తెలుగుదేశం పొత్తు( Janasena Telugu Desam alliance ) చర్చల్లో ముఖ్యంగా అర్థబలం గురించిన చర్చే కీలకం కానున్నదని వార్తలు వచ్చాయి.

Telugu Active Role, Ap, Bvsn Prasad, Bvsnprasad, Janasena, Janasenatelugu, Pawan

అధికంగా సీట్లు కోరుకుంటున్నప్పటికీ వాటిని గెలిపించుకునేంత ఆర్థిక వనరులు పార్టీకి లేవు కాబట్టి అనవసరంగా ఎక్కువ సీట్లు కోరుకుంటే అవి వృధాగా పోతాయని కాబట్టి తెలుగుదేశానికి మెజారిటీ సీట్లు ఉంచి తక్కువ సీట్లు కోరుకోవాలంటూ అనేక విశ్లేషణలు వచ్చాయి.నిజానికి ప్రస్తుత పరిస్థితి చూస్తే డబ్బు అన్నది కీలకమైన వనరు అయిపోయింది .ఎంత వ్యతిరేకత ఉన్న ధనం దానిని బ్యాలెన్స్ చేసే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆకరి నిమిషం లో డబ్బు పంచిన వాడిదే అధికారం అన్న పరిస్థితి ఉంది అలాంటప్పుడు జనసేన ఎలా నెగ్గుకొస్తుందో అన్నఅనుమానాలు కూడా ఉన్నాయి .

Telugu Active Role, Ap, Bvsn Prasad, Bvsnprasad, Janasena, Janasenatelugu, Pawan

అయితే క్రమంగా పరిస్థితి మారుతున్నట్లుగా తెలుస్తుంది .పార్టీ పై ఆసక్తి ఉన్న వారు ఒక్కొక్కరుగా ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావడం ఆ పార్టీకి మంచి పరిణామంగానే చెప్పాలి టాలీవుడ్ బడా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్( BVSN Prasad ) కూడా పార్టీ కండువా కప్పుకున్నారు.ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.ఆయనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే ఒక నియోజకవర్గానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చే సత్తా ఆయనకు ఉంది.

అంతే కాకుండా జనసేన ఎన్నారై విభాగం కూడా కొంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.రాష్ట్రానికి మంచి జనసేనతో జరుగుతుందని నమ్ముతున్న ఎన్నారై విభాగం తమకు చేతనంత సహాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

మరో పక్క పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో ఆశిస్తున్న కొంత మంది వ్యాపారవేత్తలు కూడా జనసేనతో టచ్ లో ఉన్నారని క్రమంగా ఆర్థిక వనరులు కూడా సమకూరుతున్నందున జనసేన వచ్చే ఎన్నికలలో ప్రభావంతంగా పోటీ పడుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube