తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ హీరో నిఖిల్ ( nikhil ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయమున్న నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీని సంపాదించుకున్నాడు.
ఇటీవల కాలంలో విభిన్న కథలను ఎంచుకుంటూ కెరియర్ పరంగా దూసుకెళ్తున్నాడు.కాకుండా ఈ మధ్యకాలంలో నిఖిల్ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీని సృష్టిస్తున్నాయి.
కాగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా( pan india ) సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా హ్యాపీడేస్ సినిమా( Happy Days movie ) సమయంలో ఒక సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు.స్వామిరారా సినిమా తరువాత నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ హిట్స్ వచ్చినా రాకపోయినా కొత్త కథలనే ఎంచుకుంటూ సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో నిఖిల్ చేసిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోయినా మంచి పేరు తెచ్చాయి.
ఇటీవల కార్తికేయ 2 సినిమా దేశవ్యాప్తంగా భారీ హిట్ సాధించడంతో నిఖిల్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.
కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడు నిఖిల్.త్వరలో స్పై( Spy ) అనే భారీ పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక నిఖిల్ కెరీర్ లో కార్తికేయ2 తో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన అభిషేక్ అగర్వాల్ బ్యానర్ తో పాటు కొత్త బ్యానర్ అనౌన్స్ చేసిన రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ బ్యానర్ లో తాజాగా నిఖిల్ హీరోగా మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు.
అయితే ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి 25 వేలు లంచం ఇచ్చాను అని చెప్పిన నిఖిల్ ఇప్పుడు 100 కోట్ల పాన్ ఇండియా సినిమాలో హీరోగా చేస్తున్నాడు.కొన్ని సంవత్సరాలుగా ఎంతో సహనంతో, ఎంతో కష్టంతో కూడుకున్న సక్సెస్ ఇది.