సుకుమార్( Sukumar ) దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా నటించిన సినిమా ఆర్య.ఇది విడుదల అయ్యాక ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలుసు.
ఈ సినిమా తర్వాతనే అల్లు అర్జున్ స్టార్ హీరో గా ఎదగడం మాత్రమే కాదు స్టైలిష్ స్టార్ గా కూడా గుర్తింప బడ్డాడు.దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా లెక్కల మాస్టారు అయినా సుకుమార్ కి మొట్ట మొదటి చిత్రం కావడం విశేషం.
ఇక ఈ చిత్రం అందరి కంటే ఎక్కువగా అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ ని ఒక రేంజ్ లో పెంచింది.అయితే ఆర్య చిత్రం సుకుమార్ మొదట తీయాలి అనుకున్నప్పుడు హీరో అల్లు అర్జున్ అని అనుకోలేదట.
మొదట ఈ సినిమా కథను అల్లరి నరేష్( Allari Naresh ) కి చెప్పాడట.కానీ అప్పటికే కామెడీ తో పిసికెక్కిస్తున్న అల్లరి నరేష్ అంతటి లవ్ స్టోరీ ని హ్యాండిల్ చేయలేను అనుకోని రిజెక్ట్ చేసాడట.పైగా దీనికి నేను సెట్ కాను కానీ కథ మాత్రం చాల బాగుంది అని చెప్పారట అల్లరి నరేష్.ఇక ఆ తర్వాత చాల మంది ఈ సినిమ కథను విన్న కూడా ఎవరు ముందుకు రాలేదు కానీ అప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న అల్లు అర్జున్ ఒకే అనేశాడు.
దిల్ రాజు( Dil raju ) నిర్మించిన ఈ సినిమా 2004 మే 7 న విడుదల అయ్యింది.ఆ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ను అల్లరి నరేష్ వదిలేయడం పై ఇండస్ట్రీ లో గుసగుసలు మొదలయ్యాయట.
ఈ సినిమా కనుక చేసి ఉంటె ఇంత పెద్ద విజయం సాదించకపోవచ్చు అనే మాట చాలా మంది అనేవారట.
ఏది ఏమైనా మల్టీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని మంచి విజయవంతమైన సినిమాగా తీయడం లో సక్సెస్ అయ్యారు.ఆ తర్వాత ఈ చిత్రానికి ఆర్య 2( Arya 2 ) అంటూ సీక్వెల్ కూడా తీశారు కానీ అది పెద్ద విజయం సాధించలేదు.ఈ సినిమా తర్వాత సుకుమార్ తీసిన జగడం కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
ఇక విచిత్రంగా ఈ సినిమ తర్వాత అల్లు అర్జున్ పుంజుకొని బన్నీ, హ్యాపీ, దేశ ముదురు, పరుగు, శంకర్ దాదా జిందాబాబ్(క్యామియో) అంటూ వరస విజయాలు అందుకున్నాడు.దాదాపు ఐదేళ్ల తర్వాత ఆర్య 2 తోనే అతడికి మొదటి ప్లాప్ పడింది.