సోషల్ మీడియా వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఒక్కోసారి మనల్ని వెంటాడుతూ ఉంటాయి.దానికి కారణం అవి మన మనసుల్ని తాకుతాయి.
అవును, అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఇపుడు సోషల్ మీడియాలో ఇంటిజన్ల మనసులను రంజింపజేస్తుంది.ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వైరల్ అవుతున్న ఆ వీడియోని ఒక్కసారి గమనిస్తే నిజమైన ప్రేమ( True Love ) ఎలా ఉంటుందో బోధపడుతుంది.
కాగా ఆ వీడియోని చూసిన జనాలు చాలా భావోద్వేగానికి గురవుతున్నారు.
ఇక్కడ వీడియోని గమనిస్తే మండుటెండలో రోడ్డుపక్కన అమ్ముతున్న కూల్‌డ్రింక్( Cool Drink ) తాగేందుకు ఒక వృద్ధుడు ఆగాడు.వేంటనే ఆ షాపువాడు ఇచ్చిన షరబత్ తీసుకొని వెంటనే తాగేయకుండా, తన జేబులో వున్న తన భార్య ఫోటోని తీసి, ముందుగా తన భార్యకు ( Wife ) దానిని చూపిస్తూ ఆ ఆరువాత దానిని ఆరగించాడు ఆ వృద్ధుడు.ఆ అందమైన దృశ్యాన్ని అక్కడే వున్న ఒకరు తమ సెల్ ఫోన్లో బంధించగా ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్ల మనసులను స్పృశిస్తోంది.
చపోయిన తర్వాత కూడా భార్యపై అతను చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు నెటిజనం.
నిజమైన ప్రేమ అంటే ఇదే కదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు స్పందిస్తూ… నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే నేను ఈ అందమైన క్లిప్‌ను చూపిస్తాను.అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది అయితే ఆ వీడియో ముందు ఎలాంటి ప్రేమకథలు సినిమాలైనా పనికిరావు అని కితాబిస్తున్నారు.ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని గుర్పిందర్ సంధు అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఈ వీడియోకి 3 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం కొసమెరుపు.