వైఎస్ వివేకా( YS Viveka ) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.గత ఏడాది ఎన్నికల ముందు ఏపీలో హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ ఇప్పటికీ కూడా ఓ కొలిక్కి రావడంలేదు.
ఈ కేసులో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ కాగా.వారిలో వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు.
ఇక ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు మొదటి నుంచి కూడా గట్టిగా వినిపిస్తోంది.ఇప్పటికే ఎన్నో మార్లు సిబిఐ విచారణ ఎదుర్కొన్నా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లే తెలుస్తోంది.
అయితే సిబిఐ విచరణ ఉన్న ప్రతిసారి అవినాష్ రెడ్డి.ఏదో ఒక రీజన్ తో విచారణను వాయిదా వేస్తూనే ఉన్నారు.

అంతే కాకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ను ఆశ్రయిస్తూనే ఉన్నారు.దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో చివరకు ఏం జరగబోతుందా ? అనే చర్చ అందరిలోనూ ఉంది.కాగా ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయగా.ముందస్తు కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐ కి లేఖ రాశారు.
దాంతో ఎట్టి పరిస్థితిల్లోనూ 19న విచారణకు హాజరు కావాల్సిందేనని సిబిఐ మరోసారి నోటీసులు పంపగా.నేడు ( మే 19 ) అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది.

అయితే అనూహ్యంగా ఆయన తల్లికి గుండె పోటు రావడంతో నేడు జరగాల్సిన విచారణకు గైర్హాజరు అయ్యారు అవినాష్ రెడ్డి.దీంతో సిబిఐ ఏం చేయబోతుందనే చర్చ హాట్ టాపిక్ అయింది.ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే విచారణ ఉన్న ప్రతిసారి పలు రకాల కారణాల వల్ల ఆయన విచారణను వాయిదా వేస్తూనే ఉన్నారు అవినాష్ రెడ్డి. దీంతో ఆయన అరెస్ట్ భయంతోనే ఇలా చేస్తున్నారా ? లేదా యాదృచ్చికంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా ? అనేది చర్చ కూడా జరుగుతోంది.మరోవైపు వచ్చే నెల 30 నాటికి వివేకా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సీబీఐకి అధెశాలు ఇచ్చిన సంగతి విధితమే.ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఆయనకు అరెస్ట్ తప్పెలా లేదనేది మరికొందరి వాదన.
మరి ఏం జరుగుతుందో చూడాలి.