ప్రతి ఒక్కరికీ పెళ్లి విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి.కొందరు పెళ్లిని సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడితే మరి కొందరు మాత్రం చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు.
ప్రముఖ కన్నడ నటులలో ఒకరైన రఘు రామప్ప(Raghu Ramappa) తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా కన్నడ ఇండస్ట్రీలో మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఐదేళ్లుగా ఒక యువతితో ప్రేమలో ఉన్న ఈ నటుడు తాజాగా పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పారు.
శుక్రవారం రోజున బెంగళూరులో ఈ ప్రముఖ నటుడి వివాహం గ్రాండ్ గా జరిగింది.రఘు రామప్ప తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మాది లవ్ మ్యారేజ్ అని కాకపోతే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్ననని రఘు రామప్ప చెప్పుకొచ్చారు.ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని ఆయన అన్నారు.
ఆ సమయంలో మా మధ్య ప్రేమ పుట్టిందని రఘు రామప్ప తెలిపారు.
మా పెళ్లి ఎప్పుడో జరగాలని అయితే కరోనా వల్ల మా ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయని ఆయన అన్నారు.మా నాన్నకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని శివమొగ్గలోని(Shiva Mogga) ప్రైవేట్ ఫారెస్ట్ లో పెళ్లి చేసుకోవాలని నేను భావించానని రఘు రామప్ప చెప్పుకొచ్చారు.అయితే అడవిలో పెళ్లి చేసుకుంటే అతిథులకు ఇబ్బంది అవుతుందని నేను భావించానని రఘు రామప్ప కామెంట్లు చేశారు.
ఈ రీజన్ వల్లే బెంగళూరులో(Bangalore) మండపం ఫిక్స్ చేశామని రఘు రామప్ప చెప్పుకొచ్చారు.పెళ్లైంది కాబట్టి ఈ వారం రోజుల పాటు గుళ్లూ గోపురాలు తిరుగుతానని ఆయన కామెంట్లు చేశారు.వారం రోజుల తర్వాత హనీమూన్(Honeymoon) కు సంబంధించి ప్లాన్ చేస్తామని రఘు రామప్ప పేర్కొన్నారు.నాకు చారిత్రక ప్రదేశాలు(Historical Places) ఇష్టమని అలాంటి ప్రదేశాలకు హనీమూన్ కు వెళ్లాలని అనుకుంటున్నామని రఘు రామప్ప చెప్పుకొచ్చారు.
ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.