పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న రేంజర్లు రావల్పిండికి తరలించారు.ఇమ్రాన్ అరెస్ట్ పై పాక్ లో తీవ్ర నిరనసలు వెల్లువెత్తుతున్నాయి.
లాహోర్, కరాచీ మరియు ఇస్లామాబాద్ లో రోడ్డెక్కిన పీటీఐ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఇస్లామాబాద్ కోర్టు తీవ్రంగా మండిపడింది.
ఆయనను ఏ కారణంగా అరెస్ట్ చేశారో చెప్పాలని సీజే తెలిపింది.లేనిపక్షంలో ప్రధానికి సమన్లు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
భవిష్యత్ కార్యాచరణపై ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని పీటీఐ ఏర్పాటు చేసింది.అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్ పై దాడి జరిగిందని పీటీఐ ఆరోపిస్తుంది.