కొందరు వ్యక్తుల గురించి వింటే.సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది.
ఒక మహిళ మృతదేహాల అవయవాలను దొంగతనంగా అమ్మి డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకుంది.ఈ మహిళ అవయవాలు అమ్మే విధానం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.
వివరాల్లోకెళితే.అమెరికాలోని అర్కాన్సాస్ అనాటమీ ల్యాబ్ కు శవాలు విరాళంగా వస్తూ ఉంటాయి.
ఓ మహిళ ఆ శవాల శరీర భాగాలను దొంగలించి ఫేస్బుక్ ద్వారా విక్రయానికి పెట్టేది.ఇలా దాదాపుగా 20 బాక్సుల అవయవాలను విక్రయించి.రూ.9 కోట్ల రూపాయలు అర్జించింది.ఆర్కాన్సాస్ యూనివర్సిటీ అనాటమీ( University of Arkansas Anatomy ) లో కెన్ డేస్ చాంప్ మన్ స్కాట్ ( Champ Mann Scott )(36) అనే మహిళ పని పనిచేస్తూ.చీకటి వ్యాపారం చేయడం మొదలుపెట్టింది.
మృతదేహాలను రవాణా చేయడం, మృతదేహాలను పూర్తి పెట్టడం, అవసరమైతే వాటిలోని కొన్ని శవాలను లేపనాలు పూసి భద్రపరచడం ఆమె పని.కాబట్టి ఎవరికి తనపై అనుమానం రాదనే నెపంతో పెన్సిల్వేనియా కు చెందిన జెరెమీ లీ పాలీ( Jeremy Lee Pauley ) (40) అనే వ్యక్తితో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని 2021 అక్టోబర్లో ఒక గుండె, రెండు మెదడులను 1200 డాలర్లకు విక్రయించింది.
అప్పటినుంచి 9 నెలల కాలంలోనే మృతదేహాలకు సంబంధించిన చర్మం, గుండె, మెదడు, ఊపిరితులు, కళ్లు, మూత్రపిండాలు, కాలేయాలు లాంటి అవయవాలను దొంగతనం చేసి ఫేస్బుక్ ద్వారా 20 అవయవాల బాక్సులు అమ్మేసింది.అతనితో 16 సార్లు లావాదేవీల ద్వారా 10975 డాలర్లను చెల్లించుకుంది.డిటీస్ అనే పేరుతో స్కాట్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి దందా ప్రారంభించింది.ఆమె ఫేస్ బుక్ లో దాదాపుగా 380 మంది సభ్యులు ఉన్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 5న పోలీసులు స్కాట్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.ఈరోజు మే 2న ఆమెకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై స్పష్టత రానుంది.
ఈ కేసు పై విచారణ మే 30న ప్రారంభం కానుంది.