ముఖ్యంగా చెప్పాలంటే మంగళవారం రోజున చాలా మంది హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.అంతేకాకుండా ఈరోజు మంగళాదేవ్ అంటే అంగారకుడికి అంకితం చేయబడిన రోజు.
జ్యోతిషా శాస్త్రం లో అంగారకుడి స్వభావం ఉగ్రమైనదిగా పరిగణిస్తారు.ఎవరి జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటాడో అతని జీవితంలో సానుకూలత ఉంటుంది.
అయితే ఎవరి జాతకంలో కుజుడు స్థానం( Kuja Dosha ) సరిగ్గా ఉండదో అతడికి కష్టాలు, ప్రమాదాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని బలోపేతం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి.
ఈ పరిహారాలు చేయడం వల్ల మనిషి జీవితంలో ఆనందం, శాంతి వస్తుంది.దీనితో పాటు కుజుడు మంచిగా ఉంటే అతడు నింద, భయం మొదలైన సమస్యల నుంచి బయటపడతాడు.
అంతేకాకుండా మంగళవారం రోజున ఎరుపు ఆవుకు బెల్లం( Jaggery ) ముక్కను రోటిలో చుట్టి తినిపించడం ఎంతో మంచిది.
ఈ పరిహారం చేయడం ద్వారా కుజదోషం దూరమైపోతుంది.అలాగే పనిచేసే రంగంలో పురోగతి లభిస్తుంది.మంగళ దోషం ఉన్నవారు మంగళవారం రోజు కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి నదిలో లేదా హనుమాన్ దేవాలయం( Hanuman temple )లో ఉంచాలి.
ఇలా ఏడు మంగళవారలు నిరంతరంగా చేయాలి.ఈ పరిహారం చేయడం వల్ల వ్యక్తి జాతకంలో కుజుడు ఉన్న స్థలం స్థానం బలపడి మంగళ దోషం దూరమైపోతుంది.
అంతేకాకుండా మంగళవారం రోజున గోవుకు, కోతులకు సేవ చేయడం వల్ల జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది.ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో అన్ని సమస్యలు దూరం అవుతాయి.అంతేకాకుండా మంగళవారం రోజు హనుమంతుని దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత బెల్లం, పప్పు, బూంది సమర్పించాలి.అంతేకాకుండా కోతులకు బెల్లం, శనగలు తినిపించాలి.21 మంగళవారాలు ఇలా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సుతోపాటు జీవితంలో కొత్త పురోభివృద్ధి ఉంటుంది.