రాజన్న సిరిసిల్ల జిల్లా :శ్రీ రామ నవమి సందర్భంగా అమెరికాలో సందర్భంగా జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం రంగరంగవైభవంగా గురువారం జరగగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బొమ్మ కంటి వెంకన్న గుప్తా- భూలక్ష్మీ దంపతులతో పాటు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన భారతీయులు పాల్గొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బొమ్మకంటి అభినయ్ నిఖిత దంపతులు, బుస్స గంగన్న కుమారుడు వంశీ లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా లకు చెందిన వారితో పాటు భారతీయులు పాల్గొని అమెరికా లో స్థిరపడిన మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు చెందిన అక్కడి హనుమాన్ టెంపుల్ ఆలయపూజారులు తీర్ర ప్రసాదాలు పులిహోర వితరణ చేశారని బొమ్మకంటీ వెంకన్న చెరవాణిలో మాట్లాడుతూ తెలిపారు.




Latest Latest News - Telugu News