సైబర్ నేరగాళ్ల ఫేక్ వెబ్ సైట్.. రూ.14 లక్షలు ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వ్యాపారి..!

ప్రపంచం టెక్నాలజీలో ఎంత అభివృద్ధి చెందుతున్న అంతకంటే అడ్వాన్స్ లో ఉన్నారు సైబర్ నెరగాళ్లు.అమాయకులను మోసం చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులను ఓపెన్ చేసి ఉంచారు ఈ సైబర్ నేరగాళ్లు.

 Fake Website Of Cyber Criminals.. Trader Who Was Cheated By Investing Rs.14 Lak-TeluguStop.com

ముందు వెనక ఆలోచించకుండా అత్యాశకు పోయి అనవసరంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి లక్షలు పోగొట్టుకుంటున్నారు.

సైబర్ నేరగాళ్ల ఫేక్ వెబ్ సైట్ ను గుర్తించలేక భారీగా లాభాలు వస్తాయని, 14 లక్షలు ఇన్వెస్ట్ చేశాక తాను మోసపోయానని విషయాన్ని గ్రహించాడు ఓ వ్యాపారి.

తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఒక వ్యాపారి భారీగా లాభాలు వస్తాయని ఒక ప్రైవేట్ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆన్ లైన్ సర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ కనిపించింది.

వెబ్ సైట్ లోని వివరాలు అన్నీ ఆ వ్యాపారికి తెగ నచ్చేశాయి.వెంటనే తన డీటెయిల్స్ వెబ్ సైట్ లో ఎంటర్ చేశాడు.

అనంతరం అతనికి ఒక వాట్సాప్ లింక్ వస్తే అందులో బ్యాంక్ డీటెయిల్స్ కూడా పొందుపరిచాడు.కేవలం ప్రతినెల 50 వేలు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు.వారి మాయమాటలను నమ్మిన వ్యాపారి నెలకు 50 వేల చొప్పున దాదాపుగా 14 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.

కొంతకాలం వేచి చూశాక లాభాలు కాదు కదా కనీసం తాను పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకున్నాడు.ఇక చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా లాభాలు వస్తాయని ఫేక్ వెబ్సైట్లు, లింక్స్ ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఇటువంటి మోసాలు బయటపడినప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube