ఎవరు ఏమైనా రాసుకోండి.నచ్చింది సృష్టించుకోండి… నాకు ఎలాంటి పట్టింపులు లేవు అనే విధంగా సాగుతోంది సాయి పల్లవి జీవితం.
ప్రస్తుతానికి విరాటపర్వం, గార్గి సినిమాల షాక్ నుంచి ఆమె బయటకు వచ్చినట్టు లేదు.ఏ సినిమాలోను సైన్ చేసినట్టు తెలియడం లేదు.
కొంతమంది అయితే ఆమె సినిమాలు వదిలేసి గైనకాలజిస్ట్ గా అవతారం ఎత్తబోతోంది అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాసేస్తున్నారు.ఇక ఏదో ఆసుపత్రి కడుతోంది నటనకు ఫుల్స్టాప్ పెట్టింది అనే వార్తలు కూడా వినిపించాయి.
ఇలాంటి ఎన్ని వార్తలు వచ్చినా సాయి పల్లవి నుంచి ఎలాంటి సమాధానం వినిపించడం లేదు.

ఆమె తదుపరి సినిమా ఏంటో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు.మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు అంటే పెట్టింది పేరు సాయి పల్లవి.సమంత, సాయి పల్లవి,,,, ఇలాంటి నటీమణులు మాత్రమే.
ఎలాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమా అయినా తీయగలరు.కానీ సమంతకి ఉన్న కాస్త నెగిటివ్ పబ్లిసిటీని పక్కన పెడితే సాయి పల్లవి ఎల్లప్పుడూ క్లీన్ చిట్ తో ఉంటుంది.
ఆ మధ్య చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెను ఇంకా వదిలిపెట్టినట్టు లేదు.అందుకే అజ్ఞాతవాసం విడిచి ఆమె బయటకు రావడానికి ఇష్టపడటం లేదు.
ఇక ఆమె మంచి భక్తురాలు.పేరులోనే ఉన్న సాయి ఆమె మనసులో కూడా ఉన్నాడు అందుకే సాయిబాబా ఆమెకు ఇష్టమైన దైవం.

కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే సాయి మందిరంలో ఆమె సేద తీరింది.మామూలు చీర కట్టుకొని మాస్క్ ధరించి అత్యంత సాధారణ భక్తుల్లో ఆమె కలిసిపోయింది.చాలా మంది ఆమెను గుర్తు కూడా పట్టలేదు.దైవ చింతనలో సాయి పల్లవి కొంత సమయం గడిపింది.కొంతమందికి భక్తులు గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకున్నారు కూడా.సరే ఆమె నూతన సంవత్సర వేడుకల సంగతి పక్కన పెడితే తదుపరి ప్రాజెక్టు ఏంటి అని ఆమె అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.
అతి త్వరలోనే ఏదైనా సినిమా పేరు అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.







