ఇంగ్లండ్, అమెరికా వంటి అగ్రదేశాలను గడగడలాడించిన కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్‌బీబీ 15 వేరియంట్ తెలంగాణలోకి ప్రవేశించింది.రాష్ట్రంలో మూడు కేసులను గుర్తించినట్లు హైదరాబాద్ లోని జన్యు ఆధారిత ప్రయోగశాల తెలిపిందని సమాచారం.
దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.కాగా ఇది వైరస్ ను వేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, అందువల్ల కరోనా వేవ్స్ త్వరగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో వెలుగు చూడగా, తాజాగా తెలంగాణలో కూడా నమోదైయ్యాయని తెలుస్తోంది.
వారం వ్యవధిలోనే అమెరికాతో పాటు ఇంగ్లండ్ లో 40 శాతానికి పైగా కరోనా వ్యాప్తికి ఎక్స్‌బీబీ వేరియంటే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.
అత్యంత వేగంగా సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిని అనాధికారికంగా సముద్ర రాక్షసుడు.క్రాకెన్ అని పిలుస్తున్నారు.
ఎక్స్‌బీబీ 15 వేరియంట్ అనేక ఉత్పరివర్తనాలను పొందడం వలన ఇప్పటివరకు అత్యంత రోగ నిరోధక శక్తి కలిగిన వేరియంట్ గా మారిందని వెల్లడించారు.







