ఇన్ స్టాగ్రామ్ లో 12 మిలియన్ల ఫాలోవర్స్ తో చెర్రీ మూడో స్థానం.. మొదటి రెండు స్థానాల్లో ఆ హీరోలు?

తెలుగు ప్రేక్షకులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.

 Ram Charan Achieved Another Rare Feat On Instagram Details, Ram Charan, Tollywoo-TeluguStop.com

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.కాగా రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నారు.కాగా ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ కూడా ఇంస్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెకేషన్ టూర్స్, మూవీ అప్ డేట్స్ తో అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 12 మిలియన్లకు చేరుకుంది.

అది కూడా అతి తక్కువ సమయంలో ఈ రికార్డు క్రియేట్ చేశాడు రామ్ చరణ్.స్టార్ హీరోలకు 12 మిలియన్స్ ఫాలోవర్లు అంటే సామాన్య విషయం కాదు.

సౌత్ లో ప్రస్తుతం ఈ నెంబర్ దాటిన హీరోలు ఇద్దరే ఉన్నారు.అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరికరు విజయ్ దేవరకొండ.విజయ్ కి 19.9 మిలియన్స్ ఉండగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కి 17.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇప్పుడు 12 మిలియన్స్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ మూడవ స్థానంలోకి చేరారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు రామ్ చరణ్.అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా తన భార్య ఉపాసనతో కలిసి వేకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube