మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారే లేరు.ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో నటుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కాబట్టి.
మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు.పైగా వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంటున్నాడు.
ఇక ఆయన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో ఈ సినీ బృందం పలు ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా మొదటిసారి చిరంజీవి కూడా ప్రమోషన్స్ భాగంలో బుల్లితెరపై అడుగు పెట్టాడు.అది కూడా సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డాలో ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.
అంతేకాకుండా అందులో చిరంజీవి సుమతో బాగా సందడి చేసినట్లు కనిపించింది.
మామూలుగా సుమ అంటేనే సందడి అని అర్థం.
ఇక సుమ ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు.తన గలగల మాటలతో అందరినీ తన వైపుకు మలుపుకుంది సుమ.కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను కూడా తన మాటలతో బాగా మాయ చేస్తుంది.
బెస్ట్ అండ్ ఎనర్జిటిక్ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న సుమకు టాలీవుడ్ లో స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ సొంతం చేసుకుంది.ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది.
ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.
ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.
పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సుమ మాటలకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
కేవలం తెలుగు వాళ్లనే కాకుండా ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా తన మాటలతో సందడి చేసే సత్తా తనలో ఉంది.ఇప్పటివరకు ఎటువంటి విమర్శలు ఎదురుకాకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.అటువంటి సుమకు భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పడేస్తుంది సుమ.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది సుమ ‘సుమ అడ్డా’ అనే షో తో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఇందులో సెలబ్రెటీలతో బాగా ముచ్చట్లు పెడితే సందడి చేస్తుంది.
అయితే సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో తాజాగా ఆమె సుమ అడ్డ కి సంబంధించిన ఒక వీడియోను పంచుకుంది.
అందులో తను బ్రేక్ సమయంలో వాల్తేరు వీరయ్య లో పూనకాలు లోడింగ్ పాటకు డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది.ఇక అదే సమయంలో చిరంజీవి అక్కడికి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇవ్వగా ఆయన కూడా ఆ పాటకు గొంతు కలిపి సుమతో డాన్స్ చేయించాడు.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.చిరంజీవి తొలిసారిగా ఈ షోలో పాల్గొనగా ఆయన అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు.