బాలీవుడ్ నటి తునిషా శర్మ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.ఈమె మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్ సిని పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా తునీషా శర్మ ఆత్మహత్య హిందీ బుల్లితెర ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఇరవై ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడంపై సెలబ్రిటీలు, అభిమానలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఆమె ఆత్మహత్య విషయంలో రోజు ఒక సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ఇటీవల ఆమె పోస్టుమార్టం నివేదికలో ఆమె ప్రియుడు బ్రేకప్ చెప్పిన కారణంగానే ఆ బాధను భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వెళ్లడైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు నటుడు షీజాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే షీజాన్ ఖాన్ ను పోలీసులు విచారణ చేపడుతుండగా అతను గంటకో మాట మాట్లాడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కొద్ది రోజుల క్రితం కూడా తునీషా ఆత్మహత్యకు ప్రయత్నించగా అతడే ఆమెను కాపాడినట్లు అతను పోలీసులకు వెల్లడించాడు.అంతే కాకుండా ఇదే విషయం తునిషా తల్లికి చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని తెలిపాడు.
కాగా ఆ విషయంపై స్పందించిన తునిషా కుటుంబం వారి కూతురు ఎలాంటి ఆత్మహత్యకు పాల్పడలేదని తెలిపారు.అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న తరువాత ఒక నీటి చుక్క కూడా రాల్చని షీజాన్ ఖాన్ ఆమె అంత్యక్రియలు జరిగాయి అన్న విషయం తెలిసిన తర్వాత బోరున ఏడ్చాడట.అయితే అతని ప్రవర్తన పట్ల అనుమానంగా ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తానికి తునిషా శర్మ ఆత్మహత్య కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా తునిషా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లిన సిసి ఫుటేజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో అవుతోంది.ఆ వీడియోలు షీజన్ ఖాన్ తో పాటుగా మరొక ఇద్దరు తునిషాను ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఒక వ్యక్తి ఆమె చేతుల మీదుగా ఎత్తుకొని వెళ్తుండగా షీజన్ ఖాన్ అతనికి సహాయంగా ఉన్నాడు.ఆ విషయంపై డాక్టర్ స్పందిస్తూ షూటింగ్ సెట్లో ఉన్న వారే ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చారు కానీ అప్పటికే మరణించింది అని తెలిపారు.