కెనడాలో రోడ్డు ప్రమాదం : భారతీయుడు మృతి... ఉపాధి కోసం నెల క్రితమే వచ్చి , అంతలోనే ఇలా

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు.

 30 Year Old Indian Man Dies In Truck Accident In Canada Details, Indian Man ,tru-TeluguStop.com

మృతుడిని మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు.డిసెంబర్ 13న ఉదయం 7 గంటలకు మిస్సిసాగాలోని కోర్ట్నీ పార్క్ డ్రైవ్ , ఎడ్వర్డ్స్ బౌలే‌వార్డ్ వద్ద ఓ రవాణా ట్రక్ ఢీకొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు పీల్ రీజినల్ పోలీసులు తెలిపారు.

మిస్సిసాగాలోని ఒక ఫ్యాక్టరీలో మన్‌ప్రీత్ పనిచేస్తున్నాడు.

ఈ ఘటనపై మన్‌ప్రీత్ స్నేహితుడు బల్వీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.ఘటన జరిగిన రోజున ఉదయం 6.50 గంటలకు అతను ప్రమాదానికి గురయ్యాడని తెలిపారు.మన్‌ప్రీత్ బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ట్రక్కు అతనిని ఢీకొట్టిందని బల్వీందర్ చెప్పాడు.అతను పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా నుంచి spousal visaపై కెనడాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

అంత్యక్రియలతో పాటు మన్‌ప్రీత్‌ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకెళ్లేందుకు గాను ‘‘GoFundMe” పేజీని ఏర్పాటు చేశారు.

కాగా.గత నెలలో టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్ సైనీ అనే భారతీయ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.సైనీ షెరిడాన్ కాలేజీలో చదువుకుంటున్నాడు.

ప్రమాదం జరగిన తర్వాత తీవ్ర గాయాలతో వున్న కార్తీక్‌ను కాపాడేందుకు పారామెడిక్స్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.ఇతను 2021లో కెనడాకు వచ్చినట్లుగా సీబీసీ టొరంటో తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించి 60 ఏళ్ల డ్రైవర్‌ను టొరంటో పోలీసులు అరెస్ట్ చేశారు.ఫిబ్రవరి 16, 2023న డ్రైవర్ కోర్టులో విచారణకు హాజరవుతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube