మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, చేతి రేఖలను నమ్ముతారు.వారి జీవితంలో ఏమైనా అనుకుని సంఘటనలు జరిగితే అవన్నీ చేతి రేఖల వల్లనే జరిగాయని నమ్ముతారు.2023వ సంవత్సరంలో చాలా గ్రహాలు తమ రాశి నీ మార్చుకోబోతున్నాయి.ఇందులో కేతు గ్రహం కూడా ఉంది.
కేతు గ్రహం కన్య రాశిలోకి సంచరించబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అందువల్ల కన్యాలో కేతు సంచరించడం వల్ల ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపించే అవకాశం ఉంది.
కొన్ని రాశుల వారికి మాత్రమే ఇలా జరగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది.
కేతువు యొక్క రాశి మారడం వల్ల సింహ రాశి వారికి ప్రయోజనకంగా ఉండే అవకాశం ఉంది.
ఈ రాశి వారికి ఈ కేతు గ్రహం రెండవ ఇంట్లో సంచారహించబోతోంది.అందుకే ఈ సంవత్సరం ఈ రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు.దీనితోపాటు ఆకస్మిక ధన లాభాలను కూడా పొందే అవకాశం ఉంది.ఈ రాశి వారిలో విద్యార్థులు విదేశాలలో చదువుకునే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి వారు కూడా దీనివల్ల ఎంతో లాభం పొందే అవకాశం ఉంది.ఎందుకంటే కేతు గ్రహం ఈ రాశి వారి జాతకంలో 11 ఇంట్లో సంచరిస్తుంది.
అందువల్ల వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.అందుకే ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది.
వృత్తిపరంగా వీరు ఎప్పుడూ ముందంజలో ఉంటారు.అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభం పొందుతారు.
ధనస్సు రాశి వారికి సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది.కార్యాలయాలలో ఈ రాశి వారి పట్ల అధికారులు సంతోషంగా ఉండే అవకాశం ఉంది.అంతేకాకుండా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.వ్యాపారవేతలు వ్యాపారంలో మంచి లాభాన్ని పొందుతారు.అంతేకాకుండా వ్యాపారం విస్తరింప చేసే అవకాశం కూడా ఉంది.