సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపించడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి కియారా అద్వాని పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ఈమె గత కొంతకాలంగా నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి నటించిన షేర్షా సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది.
ఇలా గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నటువంటి వీరీ పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
ఇకపోతే ఈ నెలలోనే కీయారా వివాహం జరగబోతుందని వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ లా గోవాలో జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం ఈమె వివాహం గోవా నుంచి చండీగర్ మార్చినట్టు తెలుస్తుంది.
వీరిద్దరి వివాహాన్ని మల్హోత్రా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం చేయాలని తమ కుటుంబ సభ్యులు భావించడంతో వీరి వివాహాన్ని గోవాలో కాకుండా చండీగర్ కి మార్చినట్టు తెలుస్తుంది.అయితే వీరి వివాహం జరిగేది ఎక్కడ అని చెప్పనప్పటికీ పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఇలా కియారా సిద్ధార్థ మల్హోత్ర వివాహం చండీగర్ లో జరగబోతుందని ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈమె ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.ఇక కియారా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.