సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఒకరి తరువాత ఒకరు సినీ ఇండస్ట్రీలో మరణిస్తూనే ఉన్నారు.
ఒకరు చనిపోయారు అన్న వార్త నుంచి తేరుకోక ముందే మరొక సెలబ్రిటీ చనిపోతున్నారు.అయితే కొందరు అనారోగ్యాల కారణంగా చనిపోతుంటే మరికొందరు సూసైడ్ చేసుకునే మరణిస్తున్నారు.
ఇంకొందరు సెలబ్రిటీలు రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారు.కాగా ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది సెలబ్రిటీలు మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా కూడా అలాంటి విషాదమే ఒకటి సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో మరాఠీ నటి దుర్మరణం చెందింది.
డ్రైవర్ చేసిన చిన్న ప్రమాదం వల్ల ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఆమె మరెవరో కాదు బుల్లితెర నటి కళ్యాణి కురాలే జాదవ్.
కొల్హాపూర్ జిల్లాలో సాంగ్లీ కొల్హాపూర్ హైవేపై శనివారం రాత్రి తన ఇంటికి వస్తున్న కళ్యాణి హలోండి కూడలి సమీపంలో ఒక కాంక్రీట్ మిక్సర్ ట్రాక్టర్ ఆమెను ఢీ కొట్టింది.ఈ ఘటనలో కళ్యాణి తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లడం కాస్త ఆలస్యం అవ్వడంతో అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వదృవికరించారు.ప్రమాదంలో గాయాలు ఎక్కువ అవ్వడం తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రికి రావడానికి ముందే ప్రాణాలు విడిచింది అని వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె చావుకి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ ని అరెస్టు చేశారు.అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ హలోండిలో కళ్యాణి ఇటీవల ఒక రెస్టారెంట్లను ప్రారంభించారు.తాజాగా ఆమె రాత్రి రెస్టారెంట్ ను మూసి ఇంటికి వెళుతున్న సమయంలో ఆమె ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అమె మరణించింది.
ట్రాక్టర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశాము అని తెలిపారు పోలీసులు.కళ్యాణి మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఒక సందర్భంలో మునిగిపోయింది.