సమంత నటించిన యశోద మూవీ నేడు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైంది.ఈరోజు రిలీజవుతున్న సినిమాలలో ఈ సినిమా మాత్రమే పెద్ద సినిమా కావడం గమనార్హం.
ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఈ సినిమా గురించి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.ఈ సినిమాతో సామ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ చేరిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుందా అనే ప్రశ్నకు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.హరి హరీష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా కథ, కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.
తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు తన అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ సమంత ప్రేక్షకుల ప్రశంసలను సొంతం చేసుకోవడం గమనార్హం.

ఫస్టాఫ్ డీసెంట్ గా ఉండగా సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.సినిమాలో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి.ఇంటర్వెల్ కు ముందు వచ్చే 20 నిమిషాల సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.సినిమా స్టార్టింగ్ సన్నివేశాలు, కొన్ని సన్నివేశాల్లో సాగదీత ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.
ఇంటర్వెల్, సమంత నటన, సినిమా కాన్సెప్ట్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవడం గమనార్హం.ఈ సినిమా సమంత స్థాయిని మరింత పెంచే అవకాశం ఉండగా కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.
సమంత సినిమాకు ఏకంగా 24 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.