అనంతపురం జిల్లాలో కరెంట్ షాక్ ఘటనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రెండు వారాల్లోగా ఈ ఆడిట్ ను పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు.ఇటువంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని తెలిపారు.
సమగ్ర అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అయితే పొలం పనులకు వెళ్తున్న ట్రాక్టర్ పై విద్యుత్ తీగలు పడటంతో ఐదుగురు కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే.