Hangouts Google Chat: ఇది గమనించారా? హ్యాంగౌట్స్‌ గూగుల్‌ చాట్‌ తో రీప్లేస్ అయింది!

ఇపుడు చాలామంది చాట్ చేయడం కోసం సోషల్ మెసేజింగ్ యాప్స్ తో పాటుగా ముఖ్యంగా గూగుల్ హ్యాంగౌట్స్‌ వాడుతూ వుంటారు.గూగుల్ అందించే సర్వీసుల్లో అధిక అద్భుతమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్.

 Hangouts Have Been Replaced By Google Chat Details, Hangouts, Google Meet, Tech-TeluguStop.com

కాగా హ్యాంగౌట్స్‌ తొమ్మిదేళ్ల తర్వాత షట్ డౌన్ అయిపోతుంది.అంటే పూర్తిగా దాన్ని క్లోజ్ చేయడంలేదు.

హ్యాంగౌట్స్‌ గూగుల్‌ చాట్‌ తో రీప్లేస్ కాబోతోంది.అవును, ఈ క్రమంలో గూగుల్ చాట్ కి మారిపోవాలని హ్యాంగౌట్స్ యూజర్లను కోరడం గమనార్హం.

కాబట్టి హ్యాంగౌట్స్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ని ఉపయోగించే యూజర్లు కూడా వెబ్ లో చాట్ కి మారిపోవాలి లేదా చాట్ వెబ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది.కారణం ఏమిటంటే, గూగుల్ పాత సర్వీసుల్లో ఒకటైన హ్యాంగౌట్స్ సర్వీసులు ఈ నెల అనగా నవంబర్‌లో నిలిచిపోనున్నాయి.

అంతకంటే ముందే యూజర్లు తమ మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని గూగుల్ తాజాగా కోరింది.హ్యాంగౌట్స్ నిలిపివేసిన తర్వాత యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి గూగుల్ టేక్ అవుట్ ని వినియోగించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది చివరి వరకు వెబ్‌లో హ్యాంగ్‌అవుట్‌లు అందుబాటులో ఉంటాయని గూగుల్ వెల్లడించింది.

Telugu Google Chats, Google Hangouts, Google Meet, Hangouts, Hangouts Chrome, Ha

ఇకపోతే వెబ్‌లోని హ్యాంగౌట్స్ గూగుల్ చాట్‌కి మారిపోవడానికి కనీసం ఒక నెల ముందు అంటే కిందటి నెల టెక్ దిగ్గజం గూగుల్ ఈ మార్పుగురించి యూజర్లకి ముందుగానే సూచించింది.గూగుల్ చాట్ అనేది హ్యాంగౌట్స్ కు అడ్వాన్స్ వెర్షన్ అని తెలుసుకోవాలి.ఇందులో ఇకనుండి డాక్స్, స్లయిడ్‌లు లేదా షీట్‌లను ఎడిట్ చేయడం వంటి కొత్త ఫీచర్లను యూజర్లు ఎంజాయ్ చేయొచ్చు.

ఇందులో స్పేస్‌లు కూడా ఉన్నాయి.టాపిక్-ఆధారంగా ఎంచుకునే వెసులుబాటు కలదు.

ఇందుకోసం చాట్‌లు, గ్రూపుల్లో యూజర్లు తమ విషయాలను షేర్ చేసుకోవచ్చు.డాక్యుమెంట్ల విషయానికి వస్తే.

ఫైల్‌లు, టాస్క్‌లను ఒకే స్థానం నుంచి నిర్వహించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube