Vijay Deverakonda Mythri Movie Makers :మైత్రి మేకర్స్-రౌడీ స్టార్ కాంబో అస్సలు కలిసి రావడం లేదా?

విజయ్ దేవరకొండ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా గుర్తింపు పొందాడు.వరుస ప్లాప్స్ వచ్చినా ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

 Mythri Vijay Deverakonda Never Ending Tragedy, Mythri Movie Makers, Samantha,-TeluguStop.com

ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

దీంతో భారీ నష్టాలు చవిచూశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా కంటే ముందు విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాతో వచ్చి ప్లాప్ ఎదుర్కున్నాడు.

ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మించారు.అప్పటి నుండి వీరి ప్రయాణం సాఫీగా సాగడం లేదు.

అడుగడుగా అడ్డంకులే ఎదురవుతున్నాయి.ఈ సినిమా ప్లాప్ అయినా మరో సినిమా ప్లాన్ చేసారు.

తమిళ్ డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వం ఒక భారీ యాక్షన్ సినిమాను కూడా స్టార్ట్ చేసారు.

అయితే మొదటి షెడ్యూల్ కే ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని తెలియడంతో అక్కడికే ఆపేసారు.

అప్పటికే ఈ సినిమాకు భారీగా ఖర్చు చేసారు.ఇక విజయ్ కూడా తనకు ఇచ్చిన పారితోషికం తిరిగి ఇవ్వలేదు.

దీంతో ఈయనతో మరో ప్రాజెక్ట్ చేయాలనీ అనుకున్నారు.ఈ క్రమంలోనే ఖుషి సినిమా తెరకెక్కిస్తున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Kushi, Mythrivijay, Mythri Makers, Samantha, Shiva Nirvana-Movie

ఈ సినిమా లైగర్ రిలీజ్ కు ముందే దాదాపు 60 శాతం పూర్తి చేసారు.ఇక లైగర్ పరాజయంతో అప్పటి నుండి ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఇక విజయ్ మళ్ళీ మాములు అయ్యి షూట్ లో పాల్గొనాలి అనుకుంటే సామ్ ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.

ఈ షూట్ ఆగిపోవడంతో ఇనిమ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉండడంతో మైత్రి మూవీస్ వారు టెన్షన్ పడుతున్నారు.మరి విజయ్, మైత్రి ప్రయాణం ఎప్పటికి సాఫీగా సాగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube