ఆడపిల్ల పుట్టి పెరిగినతర్వాత.ఆమెకు పెళ్లి చేస్తే.
చాలు తల్లిదండ్రి హాయిగా నిద్రపోయే రోజులు ఒకప్పడు.కానీ ఇప్పుడు ఏ నిమిషం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని పుట్టిల్లు,, నా కొడుకు పరిస్థితి ఏంటి అని మొట్టిల్లు.
అక్రమసంబందాలతో ఎవడి కాలో పడుతున్న వాకిల్లు.ఇలా ఇలా మారడానికి కారణాలు ఏంటి.
ఎందుకు అనాలోచిత కారణాల వల్ల రెండు మూడు కుటుంబాల ఇంట్లో కుంపట్లు రేగుతున్నాయి.తప్పు ఎవరిది.
అసలు సమాజం ఎటు పోతుంది.ఈ అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు… ఇలాంటి ప్రశ్నలు సమాజాన్ని వెంటాడుతుంటే.
మరో ఘటన వెలుగులోకి రావడంతో.సమాజం విస్తు పోతుంది….
అతనికి 30 ఆమెకు 16 అక్క కూతురు అని చదువుతుండగానే పెళ్లి చేశారు ఇంటివాళ్లు.మేజర్ కాలేదు.అయినా పెల్లి చేశారు.పెళ్లైనా భర్త మాత్రం ఆమె చదువును ఆపించలేదు.
చదివించాలని నా భార్య చదువుకొని ప్రయోజకురాలు కావాలి అని కాలేజీ పీజ్ కట్టాడు.చదివుకోవడానికి వెళ్లాడు.
ఆ ఆలోచనే ఆయనకు యమపాశంగా మారిందా…? కాలేజీ అమ్మాయి అనుకుంది కానీ ఒకింటి కోడలు అనుకోలేదు.చట్టా పట్టాలు వేసుకొని అబ్బాయిలతో సరదాగా గడిపింది.
స్నేహితుల వరకే ఆగిపోయిందా పరిచయం అంటే.లేదు అక్రమ సంబంధానికి దారి చేసింది.
కాలేజీ కుర్రాడితో పెళ్లైన కాలేజీ పిల్ల లవ్ లో పడింది.స్నేహబందం ప్రేమ బందంగా అది కాస్త అక్రమ సంబందంగా మారింది.
రెండు మూడు కుటుంబాలను దహించి వేస్తోంది ఇప్పుడు ఆ ప్రేమ కథా చిత్రం….
వివాహేతర సంబందాల వల్ల కాపురాలు కూలిన వార్తలు కొకొల్లాలు.
అయినా మారడం లేదు మనుషులు.ఒక పక్క కట్టుకున్న భర్త, మరో పక్క ప్రేమించిన ప్రియుడు మరి ఇద్దరితో జర్నీ ఎలా చేసింది శ్వేతా.
అప్పుడు పదహారేల్ల అమ్మాయి ఇప్పుడు 19 ఏల్ల కోడలు.ప్రేమించన సురేశ్ ప్రేమ… మరో పక్క తాళి కట్టిన చంద్రశేఖర్ తో బందం.
చివరిగా ఒకరోజు భర్త శవం అయి తేలాడు.జననాంగాల పై గాయాలతో రక్తంతో ముద్దై కనిపించాడు.
అసలు ఎవరు చేశారు ఇదంతా.దాని వెనుక ఉణ్నది ప్రియుడు సురేశా.
తాళి కట్టించుకున్న శ్వేతనా.అసలు ఏం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలోని హిందూపురానికి చెందిన చంద్రశేఖర్‌కు శ్వేతతో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.ఒకవైపు అక్క కూతురు.మరో వైపు చంద్రశేఖర్ కంటే 16 ఏళ్లు చిన్న…అక్క కూతురు అనే కారణంతో ఇద్దరికి బలవంతంగా వివాహం జరిపించారు.పెళ్లైన తర్వాత శ్వేత కాలేజీకి వెళ్లేది.
కాలేజీలో శ్వేతకు కొందరు యువకులతో స్నేహం ఏర్పడింది.అక్కడ స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లేదని చంద్రశేఖర్ ఆమెతో తరచూ గొడవపడేవాడు.
దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యెళహంక కొండప్ప లేఔట్‌లో ఉండాలని ఇక్కడకు పంపించారు.అయినా సరే శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగించింది అని పోలీస్ ల విచారణలో తేలింది.
సురేశ్ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు.ఆమె భర్తకు తెలియకుండా ఈ తతంగం నడిపింది.
చివరికి ఈ విషయం భర్తకు తెలియడంతో మళ్లీ ఘర్షణ పడ్డారు.
ఈ క్రమంలో శ్వేత తన ప్రియుడితో కలిసి చంద్రశేఖర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.చంద్రశేఖర్‌ను అంతమొందించాలనే పక్కా ప్రణాళికతో అక్టోబరు 22న.బెంగళూరు వచ్చాడు సురేష్ .చంద్రశేఖర్ ఇంట్లోనే ఉన్నాడని, ఇదే సరైన సమయమని శ్వేత ఫోన్ చేసింది.సురేశ్ వచ్చి చంద్రశేఖర్‌ను కలిశాడు, మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి గొడవపడ్డాడు.
సురేశ్ పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్ తలపై దాడిచేశాడు.దీంతో చంద్రశేఖర్ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయాడు.
అనంతరం సురేశ్.చంద్రశేఖర్ జననాంగాలను కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
భర్త హత్య జరిగిన సమయంలో భార్య శ్వేత ఇంట్లోనే ఉన్నా ఏమి తెలియనట్లు నటించింది.భర్త మరణాంతరం కన్నీరుమున్నీరుగా విలపించింది.
సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేని సమాధానాలు చెప్పింది.
అనుమానం వచ్చిన పోలీసులు తమ దైన శైలీలో విచారణ జరుపగా.విస్తు పోయే నిజాలు బయటకు వచ్చాయి.
16 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో పెళ్లే చంద్రశేఖర్ ను కానరాని లోకాలకు తీసుకెళ్లిందా…? అయితే ఒకప్పుడు పండు ముసలికి లేత పిల్లని ఇచ్చి పెల్లి చేసినప్పుడు ఇలాంటివి జరగలేదని వృద్దుల వాదనా.మారుతున్న సమాజపు పోకడలకు హత్యలే దారులా.
ఎవరు మారాలి.ఎవరి ఆలోచనలో మార్పు రావాలి అనేది సమాజంలో అంతుచిక్కని ప్రశ్నలకు కాలానికి సమాధానం వదిలేసే దారుణమైన సమాజంలో నేడు బతుకుతున్నారు ప్రజలు.
క్షణికావేశాలు, అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనరహిత పనులు ఇవే ఇవే దారుణాలకు ఒడిగడుతున్నాయి.ఎన్నో కుటుంబాల ఇంట్లో విషాదాలను నింపుతున్నాయి…
.