తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టెర్రర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన అనంతరం పెళ్లి చూపులు సినిమాతో మరింత గుర్తింపు పొందారు.
ఇకపోతే ప్రియదర్శి హీరోగా మల్లేశం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.అనంతరం ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న ప్రియదర్శి తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడారు.ఈ క్రమంలోనే ప్రియదర్శి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని తనకు జరిగిన చేదు సంఘటనల గురించి బయటపెట్టారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు ఎన్టీఆర్ వెంకటేష్ వంటి హీరోల సినిమాలలో నటించారు వారితో నటించడం ఎలా ఉందని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ప్రియదర్శి సమాధానం చెబుతూ మహేష్ బాబు నన్ను చూడగానే నువ్వా… అంటూ ఆయన పెట్టిన ఎక్స్ప్రెషన్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.ఆయన తెరపై ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారని తెలిపారు.ఇక ఎన్టీఆర్ గారితో సినిమా అంటే కాస్త భయపడ్డాను.
ఆయనతో కలిసి మూడు రోజులపాటు సినిమా షూటింగ్లో పాల్గొనాలి అంటే కాస్త భయం వేసింది.అయితే ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో నాతో పాటు రిహార్సల్ చేస్తూ బాగా కలిసిపోయారు.
ఇక వెంకటేష్ గారు కూడా లొకేషన్ లో ఎంతో సింపుల్ గా హుందాగా కనిపిస్తారని ప్రియదర్శి హీరోల గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.