కాంతార సినిమా పై ప్రశంసలు కురిపించిన ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కాంతార పేరు మారుమోగిపోతుంది.ఈ సినిమా గత నెల 31 తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలైంది.

 The Kashmir Files Director Vivek Agnihotri Praised Kantara Movie Details, Kanta-TeluguStop.com

ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఈ సినిమాని వివిధ భాషలలో విడుదల చేయడానికి హోంబలే నిర్మాణ సంస్థ సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా విడుదల కాగా ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తమదైన శైలిలో సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేశారు.

ఈ క్రమంలోనే ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ సెల్ఫీ వీడియోని షేర్ చేశారు.

ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలియజేసిన ఈయన @శెట్టి రిషబ్ మాస్టర్ పీస్ #కాంతార సినిమా చూడటం పూర్తయింది.ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అద్భుతం.

అద్భుతమైన అనుభవం.వీలైనంత త్వరగా ఈ సినిమాని చూడండి అంటూ వివేక్ అగ్నిహోత్రి అభిమానులకు పిలుపునిచ్చారు.

ఒక రకమైన నవల అనుభూతిని కలిగించింది.

Telugu Kantara, Rishab Shetty, Rishabshetty, Sapthami Gowda, Kashmir, Vivek Agni

ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా ఉందని,ఈ సినిమాలో సంస్కృతి సాంప్రదాయాలు జానపద కళలు ఎంతో అద్భుతంగా చూపించబడ్డాయి దీపావళి అయిపోయిన తర్వాత కూడా అందరూ వచ్చి ఈ సినిమా చూడాల్సిందే అంటూ ఈయన కాంతార సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇలా వివేక్ అగ్నిహోత్రి సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube