అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు లిజ్ ట్రస్.దీంతో పట్టుమని రెండు నెలలు గడవకముందే యూకే ప్రభుత్వం పడిపోయింది.
ఈ నేపథ్యంలో అక్కడ మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.దీంతో పలువురు కన్జర్వేటివ్‌లు తప్రధాని పదవి కోసం పోటీపడుతున్నారు.
భారత సంతతి చెందిన రిషి సునాక్ అందరికంటే ముందున్నారు.యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తొలుత పోటీలో నిలబడటంతో పోటీ టఫ్‌గా వుంటుందని అంతా భావించారు.
కానీ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా బోరిస్ ప్రకటించారు.దేశ ప్రయోజనాలు, పార్టీలో ఐక్యతను దృష్టిలో వుంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో రిషి సునాక్ ఎన్నికకు దాదాపుగా మార్గం సుగమమైనట్లే.
మరోవైపు రిషి సునాక్‌కు ఆదివారం నాటికి 150 మంది ఎంపీలు మద్ధతుగా నిలిచారు.
ఈ లిస్ట్ రోజు రోజుకు పెరుగుతుందని అంచనా.తాజాగా ఇటీవల బ్రిటన్ హోంమంత్రి పదవికి రాజీనామా చేసిన సుయెల్లా బ్రేవర్‌మాన్ కూడా రిషికి తన మద్ధతు తెలపడం విశేషం.
పార్టీకి ఐక్యత, స్థిరత్వం, సామర్ధ్యం కలిగించగల వ్యక్తి రిషి ఒక్కడేనని ఆమె అభిప్రాయపడ్డారు.బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడం వల్ల దేశానికి తీవ్ర నష్టం కలిగిందని బ్రేవర్‌మాన్ పేర్కొన్నారు.
ప్రజలు తీవ్ర ఆందోళనతో వున్నారని… రాజకీయాలపైనా విశ్వాసం సన్నగిల్లుతోందని ఆమె అన్నారు.కన్జర్వేటివ్‌లలో చీలిక వస్తే.
పార్టీనే తుడిచిపెట్టుకుపోయే అవకాశం వుందని సుయెల్లా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇకపోతే. బ్రిటన్ ప్రధాన మంత్రి ఎన్నికలో తాను పోటీ చేస్తున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని… సరైన దిశగా అడుగులు వేసి దాని నుంచి బయటపడొచ్చని రిషి అన్నారు.
కరోనా సమయంలో దేశ ఆర్ధిక రంగాన్ని నిలబెట్టేలా పనిచేశానని.ఇప్పుడూ సమస్యల్ని తీర్చే అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ రిషి సునాక్ ప్రస్థానం:

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడైన రిషి సునక్.సజిద్ జావిద్ తన పదవికి రాజీనామా చేయడంతో 2020 ఫిబ్రవరిలో బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు.39 ఏళ్ల రిషి తండ్రి పేరు మోసిన డాక్టర్.బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ చదువుకున్నారు.ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
ఆ యూనివర్శిటిలో పరిచయమైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేసిన రిషి సునక్.గోల్డ్‌మ్యాన్ శాచ్ కంపెనీలో అనలిస్ట్‌గా సేవలు అందించారు.నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ డైరెక్టర్.2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి.2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
.






