కాంతార సినిమా పై ప్రశంసలు కురిపించిన ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్?
TeluguStop.com
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కాంతార పేరు మారుమోగిపోతుంది.ఈ సినిమా గత నెల 31 తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలైంది.
ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఈ సినిమాని వివిధ భాషలలో విడుదల చేయడానికి హోంబలే నిర్మాణ సంస్థ సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా విడుదల కాగా ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తమదైన శైలిలో సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ సెల్ఫీ వీడియోని షేర్ చేశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అద్భుతం.అద్భుతమైన అనుభవం.
వీలైనంత త్వరగా ఈ సినిమాని చూడండి అంటూ వివేక్ అగ్నిహోత్రి అభిమానులకు పిలుపునిచ్చారు.
ఒక రకమైన నవల అనుభూతిని కలిగించింది. """/"/
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా ఉందని,ఈ సినిమాలో సంస్కృతి సాంప్రదాయాలు జానపద కళలు ఎంతో అద్భుతంగా చూపించబడ్డాయి దీపావళి అయిపోయిన తర్వాత కూడా అందరూ వచ్చి ఈ సినిమా చూడాల్సిందే అంటూ ఈయన కాంతార సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇలా వివేక్ అగ్నిహోత్రి సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.
ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!