ప్రారంభమైన మోటో ఈ22ఎస్ మొబైల్ సేల్స్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

ప్రముఖ మొబైల్ తయారీదారు మోటారోలా ఇండియాలో మోటో E22s స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరకే విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ మొబైల్ సేల్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.

 Moto E22s Mobile Specifications And Features Details, Moto E22s, Motorola, New M-TeluguStop.com

ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి వచ్చింది.మోటో E22s రూ.10,000 కంటే తక్కువ ధరలోనే లాంచ్ కావడం విశేషం.ఈ సరికొత్త మొబైల్ షియోమీ, రెడ్‌మీ, రియల్‌మీ, శామ్‌సంగ్, టెక్నో, ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లతో పోటీపడుతుంది.

మరి దీని కచ్చితమైన ధర ఎంత, ఫీచర్లు ఏంటి, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ఈ22ఎస్ 4జీబీ ర్యామ్+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది.ఇది ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది.

ఇందులో ఎకో బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.మోటో ఈ22ఎస్ అనేది ప్రీమియం-లుకింగ్ డిజైన్‌తో వచ్చే ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్.

లుక్ ప్రీమియంగా ఉన్నప్పటికీ దీనిలో అందించిన బాడీ అనేది ప్రీమియం బాడీ కాదు.దీని బాడీని ప్లాస్టిక్‌తో తయారు చేశారు.ఈ మొబైల్ HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన IPS LCD నాచ్ ప్యానెల్‌తో వస్తుంది.

స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఆఫర్ చేశారు.ఇందులోని 16ఎంపీ ప్రైమరీ లెన్స్‌ f/2.2 ఎపర్చరు, PDAF సపోర్ట్‌తో వస్తుంది. f/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ డెప్త్-సెన్సింగ్ లెన్స్‌ కూడా ఇచ్చారు.

Telugu Budget, Latest, Moto Es, Motorola, Motorolaes-General-Telugu

సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP సింగిల్ కెమెరా ఉంది.ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు రెండూ 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ చేయగలవు.

ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్ అందించారు.దీనిలో 4జీబీ LPDDR4X ర్యామ్, 64జీబీ eMMC ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫర్ చేశారు.

ఇది 1TB వరకు ఎక్స్‌ట్రా స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్‌ను అందించారు.ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 10W ఛార్జింగ్ స్పీడ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌, ఫేషియల్ అన్‌లాక్‌ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube