కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరింది కాంట్రాక్టుల కోసమేనని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.హైదరాబాద్‌లో నిన్న జరిగిన మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మర్రిగూడ మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు.
మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
ఇందుకోసం టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ గడగడపకు తాగునీటిని అందించారన్నారు.
మన్నెగూడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సమక్షంలో పలువురు టీఆర్ఎస్‌లో చేరారు.