అమరావతి నుంచి అరసవిల్లి వరకు రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కొనసాగుతోంది.దీనిలో భాగంగా కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకు గామన్ బ్రిడ్జి మీదకి పాదయాత్ర చేరుకుంది.
ఈ నేపథ్యంలోనే బ్రిడ్జిపై పాదయాత్ర కొనసాగుతున్న సమయంలోనే ఓ రైతు గుండెపోటుకు గురయ్యాడు.అక్కడే విధులు నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీవీ.
త్రినాథ్ గుర్తించి.రైతుకు సీపీఆర్ చేసి ప్రాణాన్ని రక్షించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.దీంతో మిగతా రైతులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.