మునుగోడులో గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్

మునుగోడులో గుర్తులపై తెలంగాణ హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.

 Trs Petition In High Court On Munugodulo Signs-TeluguStop.com

నిన్న టీఆర్ఎస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు ఇవాళ విచారించనుంది.కాగా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని పిటిషన్ వేసింది.

కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు, టీవీ, మిషన్, ఓడ గుర్తులు తొలగించాలని న్యాయస్థానాన్ని కోరింది.మరోవైపు నల్గొండ జిల్లా చండూరులో ఉద్రిక్తత నెలకొంది.

రిటర్నింగ్ కార్యాలయం దగ్గర టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు.కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తు తొలగించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube