మునుగోడులో గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్

మునుగోడులో గుర్తులపై తెలంగాణ హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.

నిన్న టీఆర్ఎస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు ఇవాళ విచారించనుంది.

కాగా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని పిటిషన్ వేసింది.

కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు, టీవీ, మిషన్, ఓడ గుర్తులు తొలగించాలని న్యాయస్థానాన్ని కోరింది.

మరోవైపు నల్గొండ జిల్లా చండూరులో ఉద్రిక్తత నెలకొంది.రిటర్నింగ్ కార్యాలయం దగ్గర టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు.

కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తు తొలగించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఓరి దేవుడో.. సైనిక విమానాల్లోనే వలసదారుల దేశ బహిష్కరణ.. ఒక్కో వ్యక్తికి లక్షల్లో ఖర్చు?