బిగ్ బాస్ నిర్ణయం.. బాలాదిత్యకు షాక్.. అతడి నిర్ణయంతోనే తిండి?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే ఆరో వారానికి చేరుకుంది.ఇప్పటికే ఐదు వాడలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో వారం రోజు ఎంట్రీ ఇచ్చింది.

 Bigg Boss 6 Telugu Promo Baladitya Quit Smoking, Bigg Boss Season 6, Baladithya,-TeluguStop.com

ఆరవ వారంలో భాగంగా హౌస్ లోని సభ్యులకు వారి ఫ్యామిలీ సభ్యులపై ఉన్న బెంగ తీర్చుకునే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్.ఇక ఇప్పటికే శ్రీ హాన్ తన తల్లి వండిన మటన్ బిర్యానీ తినగా ఆదిరెడ్డి తన భార్య బిడ్డలతో కలిసి వీడియో కాల్ మాట్లాడాడు.

అయితే మిగతా కంటెస్టెంట్లకు కూడా సర్ప్రైజ్ లు ఇస్తూనే వారి నుంచి కొన్ని త్యాగాలను కోరుతున్నాడు బిగ్ బాస్.నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

ఇక అందులో ఇంటి సభ్యులందరూ ఏమి తినకూడదు లేదంటే బాలాదిత్య సిగరెట్లు మొత్తం త్యాగం చేయాలి.అప్పుడే బ్యాటరీ ఫుల్ గా రీఛార్జ్ అవుతుంది అని తెలిపారు బిగ్ బాస్.

ఇప్పుడు బాలాదిత్య అందరూ ఇబ్బంది పడటం కంటే తానే సిగరెట్ మానేస్తాను అని తెలిపాడు.

బాలాదిత్య సిగరెట్ తాగకుండా చూడవలసిన బాధ్యత కెప్టెన్ దే అని ఆదేశించాడు.ఆ తర్వాత అర్జున్ కి మూడు ఆప్షన్లు ఇవ్వగా అవి ఉపయోగించుకోకుండా సత్యా కోసం ఆరాటపడ్డాడు.కానీ బిగ్ బాస్ అందుకు ఒప్పుకోకపోవడంతో అర్జున్ తన తండ్రితో వీడియో కాల్ మాట్లాడాడు.

అది చూసి చిన్న అర్జున్ చిన్నపిల్లవాడిలా ఏడ్చేసాడు.అనంతరం గలాటా గీతలకు పిల్లి బొచ్చు ఆడియో కాల్ రెండు కావాలని కోరింది.

మరి గీతు కోరిక మేరకు బిగ్ బాస్ 2 కోరికలను నెరవేరుస్తాడా లేదా అన్నది తెలియాలి అంటే మరి కొద్దిసేపు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube