పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తుంది.కొమరాడ మండలం ఈదురువలస గ్రామంలో నీటి సరఫరా పంపులను గజరాజులు ధ్వంసం చేశాయి.
అదేవిధంగా గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశాయి.గత కొద్ది రోజులుగా ఏనుగులు పశువులపై కూడా దాడులు చేస్తున్నాయి.
దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇంతా జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని సమీప ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గజరాజుల గుంపు ఎప్పుడూ వచ్చి దాడులు చేస్తాయనే భయంతో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.