టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రత ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈమె కూడా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
ఇకపోతే ముంబైకి చెందిన అమ్మాయి కావడంతో చాలా మోడ్రన్ గా ఉంటారు.ఇక మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి కేవలం ఇంటి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.
ఈమె ముంబైకి చెందిన అమ్మాయి అయినప్పటికీ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత అచ్చం తెలుగింటి కోడలుగా కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఇంటికే పరిమితమయ్యారు.ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున తనకు సంబంధించిన విషయాలను తన పిల్లలకు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలలో నమ్రత ఎంతో క్యూట్ గా ఉండడమే కాకుండా మెడలో తాళితో ఎంతో స్టైలిష్ లుక్ లో సందడి చేశారు.ఇలా చాలా రోజులు తర్వాత మెడలో ఈ తాళి ఉండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.ఈ ఫోటోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే మహేష్ బాబు నమ్రతల వివాహం 25 మార్చి 10వ తేదీ ఎంతో నిరాడంబరంగా జరిగింది.వివాహం తర్వాత వీరిద్దరు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇక మహేష్ బాబు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామ సమయం దొరికినా కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తూ కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు.