మ‌ణిరాజ్ ద‌ర్శక‌త్వంలో పూర్తయిన ప్రొడక్షన్ నెంబర్ వన్ షూటింగ్..!

ప్రముఖ నటుడు

పృథ్విరాజ్‌

, అనూ మెహ‌త హీరో హీరోయిన్లుగా ఓ సినిమా లో నటిస్తున్నారు.ఈ సినిమా పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.తొలిసారిగా ఈ సినిమా ద్వారా పి.మ‌ణిరాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

Telugu Maniraj, Tollywood-Movie

పి.నాగ‌మ‌ణి స‌మ‌ర్ప‌ణ‌లో

ప్ర‌వీణ శివరాజ్

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థనంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ను వెతుకుతుంది చిత్ర బృందం.

ఇప్ప‌టికే మొద‌లైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి పూర్త‌య్యింది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.త్వ‌ర‌లో టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయనున్నారు అని సమాచారం.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు పి.మ‌ణిరాజ్ మాట్లాడుతూ 27 రోజుల పాటు వికారాబాద్‌, హైద‌రాబాద్ ప‌రిసర ప్రాంతాల్లోని అంద‌మైన లోకేష‌న్ల‌లో షూటింగ్ చేశాం అని చెప్పాడు.ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది.

హీరో పృథ్విరాజ్‌, హీరోయిన్ అనూ మోమ‌త బాగా న‌టించారు.

టెక్నీషియ‌న్స్ అంద‌రూ పూర్తి స‌హ‌కారం అందించారు.

షూటింగ్ పూర్త‌య్యింది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి.

ఒక రాబ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే

క్రైమ్ థ్రిల్ల‌ర్

ఇది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌రు నెల‌లో రిలీజ్ చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం.త్వ‌ర‌లోనే టైటిల్‌, ఫ‌స్ట్ విడుద‌ల చేస్తాం“ అని తెలిపారు.

ఈ సినిమాకు

మణిరాజ్

దర్శకత్వం వహించగా.ప్రవీణ శివరాజ్ నిర్మిస్తున్నారు.ఇక

పృథ్వీ రాజ్

అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఆయన తన అభిమానుల్ని ఈ సినిమాతో మెప్పిస్తాడో లేదో చూడాలి.ఇది వరకే కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.

కాకపోతే అతనికి ఆ సినిమాలతో అంతగా క్రేజ్ రాలేదు.ఇక ఈ సినిమా తో అయిన క్రేజ్ సంపాదిస్తాడో లేదో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube